calender_icon.png 13 July, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతితో భూ సమస్యల పరిష్కారం

12-06-2025 12:40:51 AM

మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్

ఘట్ కేసర్, జూన్ 11 (విజయక్రాంతి) : కాంగ్రెస్  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతితో భూసమస్యలు అన్ని విధాలుగా పరిష్కరించడం జరుగుతుందని ఘట్ కేసర్ ము న్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ అన్నారు.

మున్సిపల్ పరిధిలోని మార్పల్లిగూడెం లో బుధవారం తహసిల్దార్ రజని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవిన్యూ సదస్సులో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్  పావని జంగయ్య యాదవ్ భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదలు తెలియజేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూమి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నారని, భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు.

భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తుందని, రెవె న్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.ఈకార్యక్రమంలో మాజీ స ర్పంచ్ చిలుగూరి సాయిలు, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నాగరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.