calender_icon.png 21 May, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు భూహక్కు చట్టం చారిత్రాత్మకం

21-05-2025 01:25:53 AM

-రాష్ట్ర సంక్షేమంలో ‘ఆరో హామీ’గా రాహుల్ అభివర్ణన

-రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంపై ప్రశంసలు

బెంగళూరు, మే 20: కర్ణాటక ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కలను నెరవేర్చే దిశగా చారిత్రాత్మక అడుగు వేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేద రైతులకు భూ యాజమాన్య హక్కులను మంజూరు చేసి వారికి హక్కు సంబంధిత పత్రాలను పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతియత్త కర్ణాటక సంకల్ప ప్రచారంలో హోసాపేటలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాం ధీ మాట్లాడుతూ.. పేదలకు భూ యాజమాన్య హక్కు పత్రాలను అందించ డాన్ని  రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమంలో ‘ఆరవ హామీ’గా అభివర్ణించా రు.

ర్ణాటక లో లక్షకు పైగా కుటుంబా లు భూ యా జమాన్య హక్కులను పొం దారన్నారు. అంతేకాదు 2 వేల నివాస ప్రాంతాలను రెవెన్యూ గ్రామాలుగా మారుస్తూ ప్రభు త్వం డిక్లరేషన్ తెచ్చిందని పేర్కొన్నారు.  రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో హామీ కమిటీలు ప్రతి లబ్ధిదారునికి హక్కు పత్రాలను అందజేయా లని కోరుకుంటున్నట్టు రాహుల్ తెలిపారు. ఇదే కార్యక్రమానికి హాజరైన మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సింధూ ర్’ పేరుతో పాక్‌పై చిన్నపాటి యుద్ధాలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పాక్ మనల్ని తక్కువ అంచనా వేస్తోందని, చైనా మద్దతుతో మనపై దాడులకు ప్రయత్నిస్తోందన్నారు.