09-09-2025 02:58:23 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): తెలంగాణ భాష దినోత్సవ సందర్భంగా విద్యాసంస్థల్లో ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ప్రజాకవి కాళోజి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఎన్నో రచనలు రాసి ప్రజలను చైతన్య పరిచారని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుకన్య తెలిపారు.తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు కాళోజీ రచనలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, పాల్గొన్నారు.