09-09-2025 08:00:09 PM
ఎస్ఆర్ఎన్ కె డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్..
బాన్సువాడ (విజయక్రాంతి): నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమరయోధుడు కాలోజీ అని బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల(SRNK Government Degree College) ప్రిన్సిపాల్ గంగాధర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.తెలుగు విభాగం, ఐక్యూఏసీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా తెలంగాణ యాసకు, మాండలికాలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు జైలు శిక్ష అనుభవించడమే కాక, వరంగల్ నగర బహిష్కరణను కూడా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి గోపాల్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వినయ్ కుమార్, ఎన్సీసీ అధికారి కృష్ణ, ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీనివాస్, రాజేష్, అనిత, అధ్యాపకులు శంకర్రావు, బట్టు విఠల్, శేఖర్, సుధాకర్ రెడ్డి, వినోషన్, మనోహర్ పాల్గొన్నారు.