calender_icon.png 9 September, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ కు ఇన్ గేట్ లేక అవస్థలు

09-09-2025 02:57:14 PM

బస్టాండ్ ముందు ప్రతిరోజు ప్రమాదాలు

తాజాగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఖానాపూర్,(విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండు(Khanapur RTC bus stand) ఎదురుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్ కు కేవలం ఒకే ఒక గేటు ఉండగా దాని నుంచే బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇరుకుగా ఉన్న ఈ గేటు ఎదురుగా నాలుగు రోడ్ల కూడలి ఉంటుంది .పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ లు, ఫంక్షన్ హాల్ రోడ్డు, మెట్టుపల్లి, నిర్మల్ ,పాత బస్టాండు రోడ్లు గేటు ముందే ఉండడంతో బస్సులు లోపలికి రావాలన్నా బయటికి వెళ్లాలన్నా నానా అవస్థలు పడాల్సి వస్తుంది. తాజాగా మంగళవారం ఇదే గేటు ఎదురు గా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ కల్వకుంట్ల నారాయణ కారును బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది .దీంతో కారు ఒకపక్క పూర్తిగా డామేజ్ కాగా, సుమారు గంటపాటు తీవ్ర గొడవ జరిగింది.

దీంతో బస్సు ను తిరిగి బస్టాండ్ లోకి తీసుకువెళ్లి సదరు కారు యజమాని పోలీస్ కేసు కు సిద్ధపడ్డాడు .దీంతో బస్సులో నిండుగా ఉన్న ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు .దీనికి కారణం బస్టాండుకు ఇటీవల నూతనంగా కాంపౌండ్ వాల్ నిర్మించారు కాగా దీనికి ఇన్ గేట్ వసతి ఉన్నప్పటికీ దానిని పూర్తిగా మూసివేసి ఒకటే గేటును ఇన్, ఔటు ,రాకపోకులకు వాడుతుండడం ఈ స్థలంలో తీవ్ర గందరగోళానికి కారణమవుతుంది. మామూలు వాహనాలకు, ప్రజల రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ విషయమై కాంపౌండ్ కు రెండు గేట్లు ఉండాల్సి ఉండగా ఎందుకు నిర్మించలేదని స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆర్టీసీ అధికారులను నిలదీసినట్లు తెలిసింది .ఇకనైనా అధికారులు స్పందించి బస్టాండ్ ముందు రాకపోకులకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.