09-09-2025 08:02:06 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని క్యాతనపల్లి పురపాలకంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం క్యాతనపల్లి పురకార్యాలయంలో కమిషనర్ రాజు(Commissioner Raju) కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఊపిరిగా జీవించిన ప్రజాకవి ప్రజల అవసరాల కోసం కాళోజీ నిరంతరం కృషి చేశారని, తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్పూర్తి నింపారని, కాళోజీ నారాయణ రావు అందించిన సేవలను కొనియాడారు.