09-09-2025 08:16:39 PM
మంథని (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా కవి శ్రీ కాళోజి నారాయణ రావు జయంతి పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని జడ్పీ హెచ్ ఎస్ గుంజపడుగు పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాళోజి తన తెలంగాణ వాడుక భాషలో కవితల ద్వారా ప్రజల్లో తెచ్చిన చైతన్యాన్ని తెలంగాణ ఉద్యమంలో వీరి కవితల స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. కాళోజి చిత్ర పటానికి మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, దాసరి లక్ష్మి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శివలీల, కర్రు సురేష్, సంగీత, స్వామి, రవీందర్, భూమయ్య, నరేందర్, విజయలక్ష్మి, సతీష్ రెడ్డి లు పాల్గొన్నారు.