09-09-2025 08:09:02 PM
మాజీ మేయర్ వై.సునీల్ రావు
కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ యాస, భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి, పద్మవిభూషన్ కాళోజి నారాయణరావు అని బీజేపీ నాయకుడు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి పురష్కరించుకొని కరీంనగర్ రేకుర్తిలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి... మాజీ కార్పోరేటర్లు సుధగోని మాధవి-కృష్ణగౌడ్, కోటగిరి భూమగౌడ్, తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ... కాళోజి నారాయణ రావు నేటితరాలకు ఆదర్శ ప్రియుడని తెలిపారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అని నినాదించిన.. ప్రజాకవి కాళోజి జీవితం అంతా తెలంగాణ భాష సాహితి సేవ దిశగా సాగిందని కొనియాడారు. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాళోజీ నగర్ వాసులు, గౌడ సంఘం నాయకులు, ఎంజీ కార్ షోరూమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.