calender_icon.png 10 September, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలి

09-09-2025 07:56:14 PM

కుభీర్: పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్బి ఆఖరిలో సోమవారం విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కుబీర్ బస్టాండ్ లో అరగంట పాటు రాస్తారోకో చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు AISB, TGVP ఆధ్వర్యంలో మండల కేంద్రం కుబీర్ లోని వివేకానంద, తపస్వి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వివేకానంద, తపస్వి డిగ్రీ కాలేజీ నుంచి స్థానిక బస్టాండ్ వరకు నినాదాలు చేసుకుంటూ బారీ ర్యాలీగా చేరుకొని, అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

వారు మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ , ఎస్టీ,బీసీ &మైనార్టీ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది అన్నారు. రియంబర్స్మెంట్ విడుదల కాక పోవడంతో యాజమాన్యాలు కాలేజీలను నిర్వహణ భారం అవుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్ రాక మూతపడ్డాయి అన్నారు.  ఇప్పుడు మరో 69 కళాశాలలో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉందని అన్నారు ఇప్పటికైనా గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు పుననృతం కాకుండా వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థి లోకం ఒకటై ఈరోజు గొంతు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి లోకం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో AISB నాయకులు జవారే రాహుల్, TGVP కార్యదర్శి తులసి రామ్, కళాశాల  ప్రిన్సిపాల్ లు Dr. సట్ల రవి, సంధ్యారాణి , అధ్యాపకులు దత్తత్రి , సాయన్న, రాములు, శ్రీనివాస్, లక్ష్మణ్, పోశెట్టి, మౌనిక, శ్రీకాంత్, దత్తు, విలాస్, రాజు, విజయ్, విద్యార్థులు ఉన్నారు.