09-09-2025 08:18:52 PM
మంత్రి లక్ష్మణ్ కు కాంగ్రెస్ నేత వినతి..
బోథ్ (విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman Kumar)ని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ కలిసారు. మంగళవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో మంత్రి కలిసిన ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సానుకూలంగా స్పందించిన రాష్ట మంత్రి త్వరలో మరిన్ని నిధులు మంజూరుకు సహకరిస్తా అని హామీ ఇచ్చారని ఆడే గజేందర్ తెలిపారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతరెడ్డి, యువ నాయకులు యండి సద్దాం, మౌలానా తదితరులు ఉన్నారు.