09-09-2025 08:14:45 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ కెఎన్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ సహకారంతో ఆటో కార్మికులకు 100 మందికి అన్నదానం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అక్షర ఫౌండేషన్ ప్రెసిడెంట్ రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్రావు.. క్లబ్ కార్యదర్శి సూర్య చందర్రావు కోశాధికారి అండెం వెంకన్న క్లబ్ ప్రతినిధులు సోమా అశోక్ నూనె వాసు తదితరులు పాల్గొన్నారు.