calender_icon.png 27 July, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాప్‌టాప్‌, సెల్ ఫోన్ దొంగల అరెస్ట్

26-07-2025 10:24:01 PM

మేడిపల్లి: ల్యాప్‌టాప్‌, సెల్ ఫోన్ లను దొంగలించే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకి పంపిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన మాధురి శ్రీలక్ష్మి(24), తండ్రి పెద్ద కాశీ రెడ్డి, తన స్నేహితురాలితో కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, కెనరానగర్ లో జీ ఏం ఆర్ గర్ల్స్ హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది. ఈ నెల 20న తమ రూమ్ లో 3 ల్యాప్‌టాప్‌ లు పోయాయని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

పోలీసులు ధర్యాప్తు చేయగా సీసీ పుటెజీ ద్వారా నిందితులను గుర్తించారు. వీరిని పట్టుకుని విచారించగ  వీరు కర్ణాటక రాష్ట్రం, శివమోగ్గాకు చెందిన ముగ్గురు నిందితులు ఏ1 దీపిక (27), ఇమె అక్క పిల్లలు విద్యార్థులు ఏ2 బస్వరక(21), ఏ3 సూర్య (22) లను  పట్టుకున్నారు.  వీరు కర్ణాటక నుండి వచ్చి లాడ్జ్ లో ఉంటూ ఈ నేరలకు పాల్పడుతున్నారని విచారణ లో తెలిందని, తనిఖీ చేయగా హైటెక్ సిటిలో కూడా 12 సెల్ ఫోన్ లు దొంగలుంచినట్టు తేలింది.వీరి నుండి 3 లాప్ టాప్స్, 12 సెల్ ఫోన్స్ రికవరి చేసి నిందితులను రిమాండ్ కు తరలించామని సిఐ గోవింద్ రెడ్డి తెలిపారు.