calender_icon.png 27 July, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ ఆధారిత బోధన కొనసాగించాలి.

26-07-2025 10:17:42 PM

వాజేడు (విజయక్రాంతి): పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ ఆధారిత బోధన కొనసాగించాలని వాజేడు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు(Mandal Education Officer Venkateswara Rao) అన్నారు. శనివారం వాజేడు నాగారం పాఠశాలలో ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ మీటింగు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ హాజరై మాట్లాడుతూ, పాఠశాలలో స్నేహపూర్వక గ్రంథాలయం ఏర్పాటు చేసి పిల్లల పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. నైపుణ్యాలను అభివృద్ధి పరిచేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, కొట్టెం సునీత, ఉండం రాంబాబు, పేరే జానకిరావు, కౌసల్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.