నీట్ పీజీ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఆగస్టు 30న పరీక్ష..
కరీంనగర్‌లో 7 కేంద్రాలు, పెద్దపల్లిలో 3, జగిత్యాలలో 1 కేంద్రం
1,835 మంది అభ్యర్థులు
కరీంనగర్, ఆగస్టు26 (విజయక్రాంతి): ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్‌పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. కరీంనగర్ జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలలో 1,505 మంది అభ్యర్థులు, పెద్దపల్లి లో 3 కేంద్రాలలో 230 మయింది, జగిత్యాల లో ఒక కేంద్రంలో 100 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగు స్తుం ది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముం దుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, జనరేటర్ బ్యా క ప్, వెలుతురు, వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల గుర్తింపు, తనిఖీల ను నిబంధనల ప్రకారం చేపట్టాలని, మొబై ల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఏఐ గ్లాసె స్, స్పు కెమెరాలు తదితర నిషేధిత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరా దని కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిత్ర, సి పి గౌస్ అ లం స్పష్టం చేశారు.
పరీక్షలకు సంబంధించి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ క రీంనగర్లో నీట్‌పీజీ పరీక్ష నిర్వహణకు ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో మొత్తం 1,505 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు.పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకం గా నిర్వహించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చే స్తున్నామని తెలిపారు. సంబంధిత శాఖల అ ధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించి తగి న ఆదేశాలు జారీ చేశామని, అన్ని శాఖల స మన్వయంతో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.






