31-12-2025 08:57:02 PM
పద్మశాలి యువజనసంఘం అధ్యక్షులు కోట కిషోర్
అచ్చంపేట: పద్మశాలీయులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని నాగర్ కర్నూల్ జిల్లా పద్మశాలి యువజనసంఘం అధ్యక్షులు కోట కిషోర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం బొమ్మరాసిపల్లి గ్రామంలో జనరల్ స్థానంలో సర్పంచ్ గా విజయం సాధించిన పద్మశాలి ముద్దుబిడ్డ చెరుకు తిరుపతమ్మ, చెరుకు మణికంఠ లను పద్మశాలి యువజనసంఘం జిల్లా అధ్యక్షులు కోట కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సర్పంచ్ చెరుకు తిరుపతమ్మని శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు.