25-07-2025 01:38:48 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అమిత్‌షా దిశానిర్దేశం
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీని విజయం దిశగా తీసుకువెళ్లాలని, అదే లక్ష్యంతో పనిచేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. గురువారం పార్లమెంట్‌లో రాంచందర్‌రావు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వచ్చినా.. అప్పుడు అమిత్‌షాతో సమావేశమయ్యే అవకాశం రాలేదు. అందు కే మరోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు వచ్చా రు. పార్టీని రాష్ర్టంలో బలోపేతం చేయడంపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో పార్టీ పరిస్థి తులు, పలువురు నేతల వల్ల కలుగుతున్న ఇబ్బందులను అమిత్‌షా దృష్టికి తీసుకుపోయారు. రాజాసింగ్‌తో పాటు బండి సంజ య్, ఈటల రాజేందర్ వ్యవహరంపైనా ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని అందుకే మరింత కష్టపడాలని సూచించారు.