25-07-2025 01:39:33 AM
సిసి రోడ్లన్నీ పూర్తి చేస్తాం
ఖమ్మం, జూలై 24 (విజయ క్రాంతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచా ర పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి గురువారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 60 వ డివిజన్ రామన్నపేటలో రూ. 96 లక్షల తో, 59వ డివిజన్ దానవాయిగూడెం లో రూ. 100 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్, డ్రెయిన్ ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసి, కార్తికేయ ఫంక్షన్ లో 1, 59, 60 డివిజన్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మం జూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల దీవె నలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ఒక్కటిన్నర సంవత్సరాలు అయిందని అన్నారు.ఇం దిరమ్మ ప్రభుత్వం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలండర్, క్రొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హాస్టల్ పిల్లలకు 40 శాతం మె స్, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీల పెంపు, ఉ గాది నుండి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం రేష న్ కార్డు పేదలందరికి ఇవ్వడం, రేషన్ కార్డు ల్లో కొత్త పేర్లు చేర్చడం, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు వంటివి అనేకం ఉన్నాయన్నారు.
నగరపాలక సంస్థ పరిధిలోని ఈ మూడు డివిజన్లలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారన్నారు. అర్హులైన ప్రతి పేదవా రికి నిస్వార్థంగా, కమీషన్ ఒక్క రూపాయి లేకుండా పథకాలు అందజేస్తున్నామన్నారు. మూడు డివిజన్లలో ఇప్పటివరకు 19 కోట్ల తో రోడ్లు నిర్మాణం చేసుకున్నట్లు, ప్రస్తుతం మరో 2 కోట్లతో పనులు చేపట్టినట్లు, మరో 3 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నట్లు, మొత్తంగా 3 డివిజన్లలో 24 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేసినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో వంద శాతం రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నా రు. పేద ప్రజల చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చే సుకున్నామని, త్వరలో రెండో విడత మం జూరు ఉంటుందని తెలిపారు.కార్యక్రమం లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడు తూ,ఈ ప్రాంత ప్రజల పన్నులు, డబ్బు, ఈ ప్రాంత అభివృద్ధి కే ఇస్తున్నామన్నారు.
అవసరమున్న ప్రతి చోట సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాని వారు బాధపడవద్దని, అర్హులైన అందరికి అందజేస్తామని, పేద వారందరికీ న్యా యం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, మునిసిపల్ ఇ ఇ కృష్ణ లాల్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజి త్, ఆర్ అండ్ బి ఇఇ పవార్, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.