06-08-2025 01:30:12 AM
కరీంనగర్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి హ రీశ్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ కు నేతలు జై కొట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్ కా ర్యాలయాల నుంచి హరీశ్ రావు ప్రజెంటేష న్ ను మంగళవారం నేతలు వీక్షించారు. క రీంనగర్ నుంచి ఎమ్మెల్యే గంగుల కమలాక ర్ తోపాటు నాయకులు హరీశ్ రావు ప్రజెంటేషన్‌ను వీక్షించారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన పవర్ పా యింట్ అద్భుతంగా ఉందని, యావత్తు తె లంగాణ ప్రజల కళ్లు తెరిపించిందన్నారు. కొందరు నాటి నుంచి నేటి వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నారన్నారు. తెలంగాణ రా కుండా కొందరు కుంట్రలు, కుతంత్రలు చేశారని అరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీకు లు బట్టబయలు అవుతుందన్నారు.
అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో స హా హరీష్రావు స్ట్రాంగ్ వార్నింగ్తో కడిగేస్తారన్నారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్రప్రభుత్వమని మాజీమంత్రి గంగుల క మలాకర్ గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపో ర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూ స్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోస మే సీఎం రేవంత్రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో హరీష్రావు బ్రీఫింగ్ చేశారన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాప్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారని... రాజకీయ జోక్యం ఎలా అవుతోందని ప్రశ్నల వర్షం కురిపించారన్నారు. కేసీఆర్ను హింసించాలనే ధోరణి తప్పా.. సీఎం రేవంత్రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు.
దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబడలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఉద్ఘాటించారు. తెలంగాణలో కమీ షన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆక్షేపించారు. 650పేజీల రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని...
నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రా జెక్టులు ఎండిపోతున్నారని అన్నారు. అం ద్రకు చంద్రబాబు సాగునీరుకు దోసుకుపోతున్నాడని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ లో గోదావరి నదిపై ఆనకట్ట కట్టలేదన్నారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయిందని, బ్రతుకు దెరువులేక దుబాయికి వెళ్లార న్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కోరుతూ సాగునీరు కోసం గోదావరిపై మేడిగడ్డకట్టిన మహానుభావుడని కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణను ఎండిపెట్టారు. ఆంద్రలో పంటను పండబెట్టారన్నా రు. కేసిఆ్ప కుట్రలతో లేనిపోనివి సృష్టించి బీఆర్‌ఎస్ ను అడ్డుకునే ప్రయత్నిస్తున్నారని అన్నారు.
మళ్లీ కేసీఆర్ వస్తేనే ఆనకట్టలు కడుతారు. తెలంగాణ రైతాంగంలో సంతోషం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, తదితరులుపాల్గొన్నారు.