06-08-2025 01:31:10 AM
కేంద్రమంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డాకు మంగళ వారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ర్టంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అం దుబాటులో ఉన్నాయన్నారు.
ఆగస్టు నెలలో పంటల అత్యధిక యూరియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం 3 లక్షల మెట్రి క్ టన్నుల యూరి యా అవసరమవుతోందని అంచనా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించి, అందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయంగా, 0.39 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందని, ఇందులో దిగుమతిగా రావాల్సిన యూరియాకు సంబంధించి షిప్ మెంట్ వివరాలు ఇంకా రాలేదని మంత్రి అన్నారు.