06-08-2025 01:29:21 AM
4 లక్షల మట్టి విగ్రహాల ఉచిత పంపిణీకి జీహెఎంసీ శ్రీకారం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి): వినాయక చవితి పండుగ సమీపిస్తున్న వేళ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకాన్ని నిర్మూలించేందుకు పర్యావ రణ పరిరక్షణే లక్ష్యంగా బల్దియా మరోసారి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 27న జరగనున్న వినాయక చవితిని పురస్కరించుకుని, జీహెఎంసీ పరిధిలో సుమారు 4 లక్షల మట్టి గణేశ్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 వార్డులలో ప్రతి వార్డుకు 2,500 నుంచి 3,000 చొప్పున మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని జీహెఎంసీ ప్రణాళిక రచించింది. ఈ బృహత్ కార్యక్రమంలో జీహెఎంసీతో పాటు హెఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా భాగస్వామ్యం అవుతున్నాయి.
ఈ మేరకు 2 లక్షల విగ్రహాలను అందించాలని హెఎండీఏను, మరో లక్ష విగ్రహాలను సమకూర్చా లని కాలుష్య నియంత్రణ మండలిని జీహెఎంసీ ఇప్పటికే కోరింది. వీటికి అదనంగా, మరో లక్ష విగ్రహాలను జీహెఎంసీ స్వయం గా కొనుగోలు చేయనుంది. ప్రజల సౌకర్యార్థం 8 అంగుళాలు, ఒక అడుగు, మరి యు 1.5 అడుగుల ఎత్తు గల మూడు కేటగిరీలలో ఈ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ పంపిణీ చేయనుంది.