calender_icon.png 19 September, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీల ఆత్మ గౌరవ సభకు తరలిన నాయకుల అక్రమ అరెస్టు

19-09-2025 07:25:05 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): లంబాడీల ఆత్మ గౌరవ సభ హైదరాబాద్ ఇందిరా పార్క్ నిర్వహించ తలపెట్టిన లంబాడా హక్కుల పోరాట సమితి గౌరవసభ విజయవంతం చేయాలని శుక్రవారం వెళ్తున్న సమయంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు నుంచి పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన గుగులోత్ వినోద్ నాయక్,

లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా లీగల్ చైర్మన్ మాలోత్ జబ్బర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బద్రి నాయక్, టౌన్ అధ్యక్షుడు మోహన్ నాయక్, తాడువాయి మండల అధ్యక్షులు మోహన్ నాయక్ లను అక్రమ అరెస్టు చేశారు. లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ నాయకులకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేశారు. కామారెడ్డి డివిజన్ , బాన్సువాడ డివిజన్, జుక్కల్ నియోజకవర్గం లోని  కామారెడ్డి జిల్లాలోని చాలా మందికి  అక్రమ అరెస్టు చేసి కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.