19-09-2025 09:46:49 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు హనుమాన్ నాయక్, అనిల్ కుమార్ లపై జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ... న్యాయవాడులపై పెరుగుతున్న దాడులను పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.