29-09-2024 12:00:00 AM
బంగ్లాతో టీ20లకు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. జట్టుకు సూర్యకుమార్ నేతృత్వం వహించనున్నాడు. సీనియర్లందరికి రెస్ట్ ఇవ్వగా.. మయాంక్ యాదవ్ నాలుగు నెలల తర్వాత జట్టులోకి రానున్నాడు.
వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలు ఉండనున్నారు. అక్టోబర్ 6న భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా.. అక్టోబర్ 12న జరగనున్న చివరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రానా, మయాంక్ యాదవ్