29-09-2024 12:00:00 AM
భారత్-బంగ్లా రెండో టెస్టు
కాన్పూర్: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మధ్యాహ్నం 2.15 వరకు వేచి చూసిన అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు 35 ఓవర్లు ఆడిన బంగ్లా 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మరోపక్క కాన్పూర్ మైదానం పరిస్థితులపై అభిమానులు గరమయ్యారు. వర్షం తగ్గినా గ్రౌండ్‌ను సిద్ధం చేయడంలో సిబ్బంది విఫలమయ్యారని ఆరోపించారు. ఇటీవల ఇదే కారణంతో నోయిడా వేదికగా జరిగిన కివీస్, ఆఫ్గన్ టెస్టు రద్దయిన సంగతి తెలిసిందే.