calender_icon.png 30 December, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజేలకు అనుమతి లేదు

30-12-2025 11:50:51 AM

డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరంగా చర్యలు 

తొర్రూరు ఎస్సై ఉపేందర్

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని డిసెంబర్ 31, జనవరి 1న తొర్రూరు ప్రాంతం అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని,  ప్రజలు ఎవరూ కూడా 31 డిసెంబర్ రాత్రి రోడ్లమీద కేకులు కట్ చేయడం గానీ, బైకుల మీద ఓవర్ స్పీడ్ తో వెహికల్స్ నడపడం గాని చేయరాదని, డీజే లకు అనుమతి లేదని తొర్రూర్ ఎస్సై జీ.ఉపేందర్ తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, రోడ్లపైన క్రాకర్స్ కాల్చడం వంటివి చేయరాదన్నారు. డిసెంబర్ 31 అనేది ప్రతి సంవత్సరం వస్తుందని, ప్రమాదాలు చోటుచేసుకుని జీవితం కోల్పోతే మళ్ళీ రాదన్నారు. అదేవిధంగా చైనా మాంజా ఉపయోగించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించడం జరిగిందన్నారు.  చైనా మాంజా వినియోగించకూడదని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.