calender_icon.png 30 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

30-12-2025 11:52:30 AM

వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం!

సంగారెడ్డి,(విజయక్రాంతి): ​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న ఆయన, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో శుభప్రదమని, ఈ భాగ్యం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.