01-09-2025 01:26:17 PM
హైదరాబాద్: కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eatala Rajendar) స్పందించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం విచారణ కేసును సీబీఐకి అప్పగించి మంచి పనిచేశారని.. కాంగ్రెస్ వాళ్లకు చేతగాకనే సీబీఐకి ఇచ్చారని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక అని.. ఈ రిపోర్టు నిలవదని.. సీబీఐ కాళేశ్వరంపై విచారణ జరిపి అవినీతిని వెలికి తీస్తుందన్న విశ్వాసం తనకి ఉందని పేర్కొన్నారు.