గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
27-07-2026 12:00 AM
మెదక్ - హైవేపై ఘటన
రామాయంపేట, జులై 26(విజయక్రాంతి): మెదక్- హైవేపై ఆదివారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో చిరుత పులి ప్రాణాలొదిలింది. హవేలీ ఘన్పూర్ మండల పరిధి గంగాపూర్ అటవీ ప్రాంతం మీదుగా రోడ్డు దాటుతున్న పులి ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనతో అటుగా వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. పలువురు పోలీసులకు సమాచారం చేరవేయగా.. జిల్లా ఫారెస్ట్ అధికారుల బృందం ఘటన స్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. చనిపోయిన ఆడ పులి నాలుగేళ్ల వయస్సు ఉంటుందని డీఎఫ్‌వో జోజి విలేకరులకు తెలిపారు. పులి మృతదేహాన్ని అక్కడ నుంచి మరో వాహనంలో తరలించి రామాయంపేట మండల పరిధి అక్కన్నపేట పార్క్ లో పోస్ట్‌మార్టం చేపట్టి అక్కడే దహనం చేశారు.






