27 July, 2026 | 1:01 AM

రోడ్డు పక్కన ఓఎంఆర్ షీట్

27-07-2026 12:00 AM

అవి పాతవి: టీజీపీఎస్సీ

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ఆవరణలో రోడ్డుపై ఓఎంఆర్ షీట్లు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించి వివరణ ఇచ్చింది. రోడ్డుపై దర్శనమిచ్చిన ఓఎంఆర్ షీట్లు ప్రస్తుత పరీక్షలకు సంబంధించినవి కావని, అవి 2018 నాటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలకు చెందినవని కమిషన్ స్పష్టం చేసింది. ఆ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎప్పుడో విజయవంతంగా పూర్తయిందని వెల్లడించింది.

సాధారణంగా పరీక్షలు ముగిసి మూడేళ్లు దాటిన ఓఎంఆర్ షీట్లను  చేస్తామని, ఈ క్రమంలోనే పాత షీట్లు బయటకు వచ్చి ఉంటాయని పేర్కొంది. అయినప్పటికీ, ఓఎంఆర్ షీ ట్లు ఎలా వచ్చాయో విచారణకు ఆదేశించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.