calender_icon.png 30 October, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అజయ్ గౌడ్

30-10-2025 06:17:18 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పడాల అజయ్ గురువారం రాష్ట్రమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక అవసరాలపై ఆత్మీయంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరామారావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, గెలుపు సాధనకు కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబుకు పడాల అజయ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లేపల్లి జానీ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రావు, చక్రధర్, బీసీ సంఘం నాయకులు రాజకుమార్, రమణరావు తదితరులు పాల్గొన్నారు.