calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలు లేని భద్రాద్రి జిల్లాగా తీర్చిదిద్దుకుందాం

27-11-2025 07:02:10 PM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బాల్యవివాహాలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా తీర్చిదిద్దాలని, జిల్లాలో అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని న్యాయ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు. గురువారం జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్ )సంస్థ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన అనేది ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్న అంశమని కావున ప్రజలు యువత కౌమార బాలబాలికలు అధికారులు ఇలా అందరి సమన్వయంతోటి సమిష్టి కృషితోటి ప్రయత్నం చేస్తే 2030 లోపే బాల్యవివాహాలను మనం భద్రాద్రి జిల్లాలో సమూలంగా నిర్మూలించవచ్చని పునరుద్ఘాటించారు.

బాల్య వివాహ నిరోధక చట్టం 2006 గురించి, దాంట్లో ఉన్న కఠినధరమైన సెక్షన్ ల గురించి వివరించడం జరిగింది. ఎవరైనా ఈ చట్టాన్ని అధిగమించి బాల్యవివాహాలు చేసినట్లయితే జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని భేటీ పడావో బేటి బచావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లల యొక్క విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాల పట్ల నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు .బాల్య వివాహాలు ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బాలల సమస్యల పరిష్కారానికి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేసి తెలపాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా మాట్లాడుతూ బాల్య వివాహాలు అనేవి ఒక సామాజిక దురాచారం అని అనదిగా కొనసాగుతున్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని అందరం కలిసి సమూలంగా నిర్మూలించాలని  జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలలకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ తుకారం రాథోడ్ ,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి  వెంకటేశ్వర్లు,షీ టీం ఎస్సై రమాదేవి, ఎయిడ్ సంస్థ డైరెక్టర్ హరి ప్రసాద్ రావు, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్, డైరెక్టర్ పోపూరి హరి ప్రసాద్ రావు, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, పంచాయతీ సెక్రటరీ వంశీకృష్ణ ,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై లక్ష్మణ్, ఏఎస్ఐ నాగయ్య, 1098 కోఆర్డినేటర్ సందీప్, యూనిట్, ఉమెన్ హబ్ బాధ్యులు రూప , డీసీపీయూ యూనిట్, ఎయిడ్ సంస్థ సోషల్ మొబలైజర్స్ మోహన్, మాన్సింగ్, జ్యోతి, మౌనిక విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.