15 April, 2026 | 9:09 AM

మెట్‌పల్లిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా

07-02-2026 12:32 AM

పట్టణ అభివృద్ధే ధ్యేయం

17వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రి

మెట్ పల్లి, ఫిబ్రవరి6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ పట్టణ అభివృద్ధే ధ్యేయంగా 17వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా పోటీలో ఉంటున్నట్టు మైలారపు లింబాద్రి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 17వ వార్డులో ప్రచారం చేస్తూ మాట్లాడారు. గతంలో ఏడవ వార్డు నుంచి గెలిచి వైస్ చైర్మన్‌గా అక్కడ తీవ్ర నీటి ఎద్దడీ సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే సుమారు వెయ్యి కొత్త పెన్షన్ లు అందిస్తూ రహదారులు, మురుగు కాల్వలు నిర్మించామన్నారు. గత మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న అనుభవంతో ప్రస్తుతం 17వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి ప్రభుత్వ సహకారంతో మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్‌గా పట్టణాన్ని అభివృద్ధి చేసి తెలంగాణకు మెట్ పల్లి మున్సిపల్ ను రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలని వస్తున్నా నన్ను ఆశీర్వదిస్తూ గెలిపిం చాలని లింబాద్రి కోరారు.