04-10-2025 12:00:00 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ లో దసరా వేడుకలు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సైతం ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్టీపర్పస్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, సామాజిక వేత్త మౌనిష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా దుర్గామాత, భారతమాత, శ్రీ సీతారామచంద్రుల చిత్రపటాలకు, జమ్మి చెట్టుకు ప్రత్యేక నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజల మధ్య అతిధులు రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రామన్న మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ చెడును వీడి సన్మార్గంలో పయనించాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగానే దసరా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన హిం దూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శులు గెడం మాధవ్,సూర్యకాంత్, గౌరవా ధ్యక్షుడు నర్సాగౌడ్, రవీందర్, ప్రజలు పాల్గొన్నారు.