calender_icon.png 4 October, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలి

04-10-2025 12:00:00 AM

-పోటీ చేసే అవకాశం లేని వారు గెలిపించే బాధ్యత తీసుకోవాలి

-స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం

-కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి), స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు పోటీ చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా  కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన జిల్లా లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల  ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సంసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఎన్నిక అయ్యే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందని అన్నారు,  అవకాశం ఉన్న ప్రతి  బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనీ సూచించారు. ఒక వేళ రిజర్వేషన్ కారణంగా పోటీ చేసే అవకాశం లేని వారు గెలిపించే బాధ్యత తీసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.

బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ  సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్ రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరుణ తార, బిజెపి కిసాన్ సెల్ అధ్యక్షుడు పోతంగల్ కిషన్ రావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మ బాలకిషన్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.