02-08-2025 08:23:16 PM
వీక్షించిన తూప్రాన్ బిజెపి ఈ నేతలు..
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ రైతు వేదిక కేంద్రంలో నేడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం 20వ విడత నిధుల విడుదల సందర్భంగా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పాల్గొని వీక్షించారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా అర్హత కలిగిన 9.7 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 20,500 కోట్లు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ డీబీటీ ద్వారా జమ చేశారు. ఈ విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరాకు 2,000 చొప్పున నిధులు అందించబడాయి, రైతుల ఆర్థిక భద్రతను గణనీయంగా మెరుగు పరిచేలా ఉందని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మున్సిపల్ అధ్యక్షుడు భూమన్నగారి జనకిరాం గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు తాటి విట్టల్, నర్సింహ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ యాద గౌడ్, మాజీ మున్సిపల్ అధ్యక్షుడు రామునిగారి మహేష్ గౌడ్ లు పాల్గొన్నారు. జనకిరాం గౌడ్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి కిసాన్ పథకం రైతులకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందించడంతో రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు, ఈ పథకం రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు.