02-08-2025 08:15:42 PM
హన్మకొండ/కేయూ క్యాంపస్ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University)లో ఎన్సీసీ పదవ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ ఆధ్వర్యంలో కంబ్యాండ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు-ఆరు, పది రోజుల క్యాంపు 24 జూలై నుండి రెండు ఆగస్టు వరకు 759 మంది ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పాల్గొన్నారాని కల్నల్ ఎస్ ఎస్ రామదురై ఒక ప్రకటనలో తెలిపారు. రిపబ్లిక్ డే 2026 ఢిల్లీలో పాల్గొనే ఎన్ సి సి కెడెట్స్స్ ఎంపిక, ప్రైమరీ స్థాయిలో పూర్తయిందని ఇందులో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరిగినట్లు ఆయన తెలిపారు. క్యాంపులో మ్యాప్ రీడింగ్, ఆర్మీ హిస్టరీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, క్రీడా నైపుణ్యం, ఫైరింగ్ వంటి అంశాలపై ఎక్స్పర్ట్ చే శిక్షణ, ఖమ్మం, వరంగల్ వివిధ బెటాలియన్ల అధికారులు బెస్ట్ కాడేట్స్, డ్రిల్లు, సంస్కృతిక విభాగాలలో నిష్ణార్ధులను ఎంపిక చేసినట్లు ఈ క్యాంపు క్యాడే ట్స్ జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఎంతో దోహదపడుతుందని క్రమశిక్షణతో, పట్టుదలతో, వ్యక్తిత్వ వికాసంతో ,మంచి నాయకత్వ లక్షణాలు కలిగి పటిష్టమైన ఆరోగ్యంగా ఉన్న ,శరీర దారుఢ్యం, అంకిత భావంతో ఉన్న పట్టుదలకు లక్ష చేదనలో సక్సెస్ కాడేట్స్ను గుర్తించి ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు రామదురై తెలిపారు.
ఈ క్యాంపు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి మరియు రిజిస్టర్ ప్రొఫెసర్ రామచందర్ , ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి మనోహర్, స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకయ్య , డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వాగ్దేవి రెడ్డి,హాస్టల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్ కుమార్ క్యాంపు విజయవంతంగా సహకరించిన, అసిస్టెంట్ రిజిస్టర్ డాక్టర్ పృథ్వి వల్లాల మరియు యూనివర్సిటీ అధికారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాంపు ఆడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే, కెప్టెన్ డాక్టర్ పి సతీష్ , కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, సుబేదారి మేజర్ జై రామ్ సింగ్, రవీందర్, సౌరస్య, అజీత్ కదం, బెటాలియన్ హవల్దార్ మేయర్ సందీప్, క్వాటర్ మాస్టర్ సుతారి, సందీప్ పవార్, లెఫ్ట్నెంట్ గణేష్, రాధాకృష్ణ, రాజమాణిక్యం, జీవన్, భవాని, సంధ్య, కళ్యాణి, సూపర్నెంట్ అరుణ, కుమారస్వామి, దత్తు, సతీష్, మహేష్, నిక్లేష్, సంతోష్, ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ,ఖమ్మం జిల్లా అధికారులు పాల్గొన్నారు.