02-08-2025 08:37:45 PM
రాజ్ గొండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుని పిలుపు..
అదిలాబాద్ (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈనెల 9న ప్రతి ఆదివాసీ గూడల్లో పండగల జరుపుకోవాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 9న ఆసిఫాబాద్ లో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అన్ని ఆదివాసీ తెగలు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. మీడియా సమావేశంలో రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా అధ్యక్షులు పంద్రం శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షలు సేద్మకి ఆనంద్ రావు, కుంర శ్యామ్ రావు, జంగు పటేల్, శేష్ రావు, శ్యామ్ రావు, సునీల్, రాజు, ఉపేందర్, హన్ను పటేల్, కోరేంగా విజయ్, మనోహర్, మారుతీ, మాణిక్ రావు, సూర్యబాన్, చిత్రు, తదితరులు పాల్గొన్నారు.