02-08-2025 08:41:37 PM
కామారెడ్డి (విజయక్రాంతి): బాధిత కుటుంబాలను శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం ఆరుగొండ కొండాపూర్ ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలలో మరణించిన వారి వివరాలు తెలుసుకొని కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను పరామర్శించారు. కొందరు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.