calender_icon.png 18 May, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతిహితంగా పండుగ చేసుకుందాం

14-03-2025 12:00:00 AM

నిజానికి ప్రకృతికి కృతజ్ఞత తెలుపడమే హోళీ పండుగ పరమార్థంగా వేదపండితులు చెప్తారు. దీనిని ఒక్క రంగుల పండుగే అన్న ట్టుగా మార్చేయడం దురదృష్టకరం. ముఖ్యంగా పరస్పరం సోదర బంధం పెంచుకోవాలి. వరుసకు సోదరులైన వారు ఒకరి కొకరు సహజంగానే రంగులు చల్లుకోరు. తోడబుట్టిన వారిపైనా రంగులు చల్లరు. ఈ రంగు చల్లడం అనేది బావా మరదల్లు, ఆ వరసయ్యే వారితోనే రంగులాట ఆడతారు. అయితే, స్నేహితులకు, పరిచ యం లేని వారికి కూడా ఇలా రంగులు చల్లడం చూస్తాం. దారెంట వెళ్లేవారు ఎక్కడ రంగులు పడి తమ శుభ్రమైన బట్టలు పాడవుతాయేమో అని భయపడుతుంటారు. ఇది ఎంత మాత్రం తగదు. జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయని, కృత్రిమ రంగులు వాడరాదు. యువకులు చెరువులు, బావుల్లోకి వెళ్లి స్నానాలు చేస్తారు. ఈత రానివారు నీళ్లలోకి దిగవద్దు.

- కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా 

కృత్రిమరంగులు వద్దు

హోళీ అంటే అందరికీ సరదానే. చాలామంది రంగులు చల్లుకుంటూ ఆలింగనం చేసుకుంటూ వాత్సల్యాన్ని ప్రకటించుకుం టారు. అయితే, ఈ వేడుక ఎంత సరదానో కొన్ని సందర్భాల్లో అం త ప్రమాదకరం కూడా. కృత్రిమ రంగులవల్ల చర్మవ్యాధులు, ఇతరేతర అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం కూడా ఉంటుంది. కనుక, ప్రమాదకరమైన కృత్రిమ రంగులకు దూరంగా ఉంటూ, సరదాలు తీర్చుకోవడం మంచిది. నిజానికి హోళీ అంటేనే మనలోని చెడును దహించుకోవాల్సిన సందర్భం. హిందువులు వసంతఋతువు ఆగమనానికి ముందు జరుపుకొనే ఈ వేడుకను విషాదాం తం చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

 -వైద్య శేషారావు, కామారెడ్డి

ఉదయం వేళల్లో బస్సులు పెంచాలి

ప్రత్యేకించి పని దినాలలో ఉదయం వేళల్లో స్కూల్, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు అధిక బస్సులు నడపాలి. చాలా బస్సులలో విద్యార్థినీ, విద్యార్థులు అందరూ నిలబడే ప్రయాణిస్తున్నారు. దీని కారణంగా గమ్యస్థానం చేరుకోవడం లోనూ జాప్యం జరుగుతోంది. అధికారులు ఆయా మార్గాలలో పూర్తి స్థాయి అధ్యయనం జరిపి బస్సుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్