18-05-2025 11:48:00 AM
హైదరాబాద్: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని ఆయనా చెప్పారు. ప్రమాదం చిన్నదే అయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపించారని తెలిపారు.
సహాయక చర్యలు వెంటనే ప్రారంభించి ఉంటే బాగుండేదని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సిబ్బందికి సరైన పరికరాలు ప్రభుత్వం అందించాలని, అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన శిక్షణ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. అలాగే అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరచుకోవాలన్నారు. బాధితులకు కేంద్రం తరపున అండగా ఉండి, భరోసా ఇస్తామని తెలిపారు. బాధితులకు ఆర్థికసాయం అందేలా ప్రధాని మోడీతో మాట్లాడుతానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు