calender_icon.png 18 May, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌తో ఈరోజు ఎలాంటి చర్చలు లేవు: రక్షణ శాఖ

18-05-2025 11:03:26 AM

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో కాల్పుల విర‌మ‌న ఒప్పందానికి సంబంధించి భార‌త రక్షణ శాఖ(Indian Defense Ministry) ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భారత్-పాక్ మధ్య ఈరోజుతో సీజ్‌ఫైర్(Ceasefire) ముగుస్తుంద‌న్న వార్త‌ల‌ను రక్షణ శాఖ ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్(DGMO)ల మధ్య ఇవాళ ఎలాంటి చ‌ర్చ‌ల‌కు ప్లాన్ చేయ‌లేద‌ని తెలిపింది. కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌కు ముగింపు తేదీ లేద‌ని రక్షణ శాఖ ప్ర‌క‌టించింది. ఈ నెల 12న ప్రకటించిన కాల్పుల విరమణ నిర్ణ‌యాలే ప్ర‌స్తుతానికి కొన‌సాగుతాయ‌ని భారత ఆర్మీ స్ప‌ష్టం చేసింది.

ఇక‌, ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌తో దాయాది పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయినా విషయం తెలిసిందే. ఎదురు దాడులు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ భార‌త బ‌ల‌గాల దెబ్బ‌కు పాకిస్థాన్ తోక‌ముడిచింది. చివ‌ర‌కు ఉద్రిక్త‌త‌లు త‌గ్గించాల‌ని పాక్ కోరడంతో భార‌త్ అంగీక‌రించింది. దాంతో కాల్పుల విర‌మ‌ణ అమలులోకి వ‌చ్చింది. వీటికి సంబంధించి మే 12న ఇరు దేశాల డీసీఎంఓల స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌ను కొన‌సాగించేందుకు మొగ్గు చూపిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.