18-05-2025 10:22:18 AM
హైదరాబాద్: చార్మినార్(Charminar) పరిధిలోని గుల్జార్ హౌస్(Gulzar House)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని మొదటి అంతస్తులో చెలరేగినా మంటల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న 16 మందిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ఉస్మానియా, హైదర్ గూడ, డీఆర్డీవో ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. గుల్జార్ హౌస్ చుట్టుప్రక్కల దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదం ధాటికి పలువురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు.