18-05-2025 09:40:18 AM
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో కిటకిటాలాడాయి. స్వామివారి సర్వదర్శనానికి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు.
కాగా, శనివారం 87,347 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 39,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు వెల్లడించారు. అలాగే, ఈరోజు తెల్లవారుజామున భారత క్రికెట్ జట్టు(Indian cricket team) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Head coach Gautam Gambhir) కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.