calender_icon.png 27 August, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు చర్యలు తీసుకోవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు

18-05-2025 12:38:20 PM

హైదరాబాద్: గుల్జార్ హౌస్(Gulzar House) అగ్ని ప్రమాద ఘటనపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(BRS MLA Harish Rao) స్పందించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైనా వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవట్లేదని, ముందస్తు చర్యలు తీసుకోవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విఫలమయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు సమిధలవుతున్నారని, ఇప్పటికైనా అగ్నిమాపక శాఖ సన్నద్దతపై సమీక్ష చేయాలని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహరం ఇవ్వాలని వెల్లడించారు.