calender_icon.png 18 May, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యానికి పెను ముప్పు

14-03-2025 12:00:00 AM

ధూమపానం ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది. భారతదేశంలో 26 కోట్లకుపైగా ప్రజలు పొగాకు వినియోగిస్తుండగా, ప్రతి ఏడాది 10 లక్షల మందికిపైగా పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. సిగరెట్ ప్రతి పఫ్ ఊపిరితిత్తులను విషపూరిత రసాయనాలతో నింపి, గుండెజబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ధూమపానం కారణంగా జీవితకాలం గణనీయంగా తగ్గిపోతోంది. ఇది పొగ తాగే వ్యక్తులకు మాత్రమే కాకుండా, వారి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా హానికరం.జర్నల్ ఆఫ్ అడ్డిక్షన్‌లో ప్రచురిత మైన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి సిగరెట్ పురుషుల్లో 17 నిమిషాలు, మహిళల్లో 22 నిమిషాల జీవనకాలాన్ని తగ్గిస్తుందని తేలింది. ధూమపానం అనేది కేవలం శారీరక వ్యసనం మాత్రమే కాదు.

అది భావోద్వేగాలు, నిత్యజీవితపు అలవాట్లతో ముడిపడి ఉంటుంది. దీన్ని విడిచిపెట్టేందుకు కుటుంబ సభ్యుల మద్దతు, ధ్యానం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమై న మార్గాలను అవలంబించడం ఉపయోగకరం. సాంకేతికత సాయంతో ఏఐ ఆధారిత యాప్‌లు, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా ధూమపానం మానేందుకు ప్రత్యేక ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. క్విట్‌నౌ వంటి యాప్‌లు వ్యక్తిగత పురోగతిని ట్రాక్ చేయడంలో సహాయపడుతున్నాయి. ధూమపానం మానటం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆర్థిక భద్రతకూ ఉపయోగకరం. పొగాకు అలవాటు వదిలేసిన వెంటనే శరీరం కోలుకోవడం ప్రారంభమవుతుం ది.

రక్తపోటు, గుండెచప్పుడు స్థిరపడతాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. మొదటి కొన్ని రోజులు సవాలుగా అనిపించినా, పట్టుదలతో, సరైన మద్దతుతో ధూమపానం మానడం మరింత సులభమవుతుంది.  ప్రతి సంవత్సరం మార్చి రెండో బుధవారం ‘నో స్మోకింగ్‌డే’గా జరుపుకుంటా రు, ధూమపానం మానడం స్వీయరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. సిగరెట్ వదలటం ముగిం పు కాదు, ఆరోగ్యవంతమైన జీవనానికి తొలి అడుగు.

 -డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ