calender_icon.png 30 July, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటినుంచే సంపాదిద్దాం!

03-10-2024 12:00:00 AM

చాలామంది అమ్మాయిలకు తమ కాళ్లపై తాము నిలబడి, కుటుంబానికి ఆసరాగా ఉండాలి అని ఉంటుంది. కానీ కొందరికి చదువు పూర్తయిన వెంటనే ప్ళ్ళుపోతుంది. దీంతో కెరీర్‌తో పాటు, ఆశలకు, ఆశయాలకు కూడా అడ్డుకట్ట పడిపోతుంది. ఇంట్లో బాధ్యతలు, చిన్నారుల సంరక్షణలో సమయం గడిచిపోతుంది. అలాంటి వాళ్లు ఇంట్లో ఉండే సంపాదించే వీలుంది. 

* మార్కెట్లో దొరికే స్క్రాప్ మెటీరియల్‌తో అందమైన వస్తువులు, కానుకలు తయారు చేయగలిగితే దానికి మెరుగులద్దుకొని ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చు. వాటిని ముందు కొందరికి ఇచ్చి చూడండి. అవి నచ్చితే వాళ్లే వచ్చి బల్క్‌లో కావాలని అడుగుతారు. 

* కొందరు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అలాంటి వారు పార్టీ ఆర్గనైజర్‌గా మారొచ్చు. ఏ శుభకార్యమైనా అలంకరణ, అతిథి మర్యాదలు వంటి వాటిని మేనేజ్ చేయ్యగలను అని దగ్గరి బంధువులకు, స్నేహితులకు సమాచారం అందించండి. మొదట్లో మిమ్మల్ని మీరు నిరూపించుకొనేందుకు డబ్బులు తీసుకోకుండా ప్రేమతో చేసి చూపించండి. మీ ప్రతిభ బయటపడిన తర్వాత డబ్బులు తీసుకోవచ్చు.

* కొందరికి ఇంట్లో, బాల్కనీలో మొక్కలు పెంచాలని ఉన్నా సమయం ఉండదు. వాళ్లకి బాల్కనీల్లోనే గార్డెనింగ్ ఏర్పాటు చేసివ్వడం కూడా మంచి ఉపాధి అవకాశం అవుతుంది.