calender_icon.png 15 May, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ విధానాల నుంచి నేర్చుకుంటాం

04-07-2024 01:35:48 AM

కృత్రిమ మేధ అభివృద్ధికి ఇండియా కృషి అమోఘం

న్యూఢిల్లీ, జూలై 3: కృత్రిమ మేధను ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు భారత్ ప్రత్యేక మైన విధానాన్ని కలిగి ఉందని ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నారా యణన్ పేర్కొన్నారు. డీపీఐ, ఓపెన్‌ఏఐ వంటి కార్యక్రమాల ద్వారా విని యోగదారులకు హానిని తగ్గించడంతో పాటు మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకునేలా భారత్ చేసిందని వివరించారు. గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికత మెరుగుదలకు కావాల్సిన  విధానాలను భారత్ నుంచి నేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇండియాఏఐ మిషన్‌కు మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.