calender_icon.png 15 May, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి

04-07-2024 01:38:37 AM

గండకి నదిపైన మరమ్మతులు చేస్తుండగా ఘటన

బీహార్, జూలై ౩: బీహార్‌లో బ్రిడ్జిలు వరుసగా కూలిపోతున్ననాయి. తాజాగా సివాన్ జిల్లా గండకి నదిపై మరమ్మతులు చేస్తుండగా వంతెన బుధవారం కుప్పకూలిపోయింది. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రంలో 7 వంతెనలు కూలిపోవడం సంచలనంగా మారింది. మహరాజ్ గంజ్‌లోని చిన్నచిన్న గ్రామాలను కలిపేందుకు నిర్మించిన ఈ బ్రిడ్జిని 1982 నిర్మించారు. అప్పటినుంచి మరమ్మతులకు నోచుకోకపోవడం, వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. స్థానికుల విజ్ఞప్తి మేరకు తాజాగా ఆ వంతెనకు మరమ్మతులు చేపట్టేందుకు బీహార్ సర్కార్ ముందుకు వచ్చింది.