calender_icon.png 16 May, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణం బంద్ చేసిన ‘కూ’

04-07-2024 01:35:03 AM

పెట్టుబడులను పొందడంలో విఫలమవ్వడంతోనే నిర్ణయం

ముంబై, జూలై 3: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్(X)కి పోటీగా 2020లో డిజిటల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ‘కూ’ అర్ధాం తరంగా తన దుకాణాన్ని మూసేసింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు మయాంక్, రాధాకృష్ణ సమాధానమిస్తూ.. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో గత కొన్ని దఫాలుగా  విఫలమవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యాప్‌ను లాభదాయక మార్గంలో నడిపేందుకు 5 సంవత్సరాలు అవసమై నప్పటికీ.. అప్పటివరకు కొనసాగేందుకు తమ వద్ద అంత మూలధనం లేదని స్పష్టం చేశారు.  అయితే కూ ప్లాట్‌ఫాంను దాదాపు 2.1 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లకు తోడు 9,000 మంది సెలబ్రిటీలు వాడుతున్నారు. ప్రారంభించిన 48 గంటల్లోనే ఈ ప్లాట్‌ఫాం బ్రెజిల్‌లోని ఒక మిలియన్ యూజర్లను ఆకర్షించింది. భారతదేశంలో ట్విట్టర్‌ను బీట్ చేసేలా కనిపించింది.