13-10-2025 01:07:54 AM
ఏఐసీసీ అబ్జర్వర్లు నారాయణ స్వామి, టీపీసీసీ అబ్జర్వర్లు, ఎమ్మెల్యే గణేష్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, ఉజ్మా షాఖిర్
మహబూబ్ నగర్, అక్టోబర్ 13(విజయక్రాంతి): పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శాయయశక్తులుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసీసీ అబ్జర్వర్లు నారాయణ స్వామి, టీపీసీసీ అబ్జర్వర్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ణేష్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, ఉజ్మా షాఖిర్ అన్నారు. ఆదివారం డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ (డిసిసి) కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించేందుకు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చామని ఆసక్తి గల వారు ఎవరైనా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవ చన్నారు. జిల్లాలో 3 రోజుల పాటు అందుబాటులో ఉంటామని నియోజకవర్గాల వారిగా, బ్లాక్ వారిగా నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22 న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 20 వ తేదీ వరకు ఇవ్వాలని తెలియజేసారు, దరఖాస్తులను పరిశీలించి, జిల్లా నుంచి 6 మంది పేర్లను ఏఐసీసీ కి అందజేస్తామని తెలియజేశారు, అనంతరం మెజార్టీ అభిప్రాయం మేరకు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ (డిసిసి) కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రా యాలు సేకరించేందుకు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చామని ఆసక్తి గల వారు ఎవరైనా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవచన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు, అన్ని అంశాలను పరిగణలకు తీసుకుని ఏఐసీసీ డీసీసీ అధ్యక్షుడి నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.
ఈ నెల 16న దేవరకద్ర నియోజకవర్గంలో 17 న జడ్చర్ల నియోజక వర్గంలో 18న మహబూబ్నగర్ నియోజకవర్గంలో బ్లాక్, మండల స్థాయి నాయకులతో ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లు సమావేశమై వన్ టు వన్ అభిప్రాయాలు తీసుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ మన్నే, జీవన్ రెడ్డి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.